News November 21, 2025

అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించండి: ఎంపీ చిన్ని

image

ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీ కేశినేని చిన్ని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న‌, ఆల‌య ఛైర్మ‌న్ బొర్రా గాంధీ, ఈవో శీనానాయక్‌తో కలిసి మహామండపం, కనకదుర్గనగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

Similar News

News November 21, 2025

బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

image

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్‌పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.

News November 21, 2025

BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

నిర్మల్‌ ఏఎస్పీగా సాయికిరణ్

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.