News November 21, 2025
HNK: రేపు సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి రాక

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే సమావేశానికి హాజరవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు హనుమకొండ కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం అమలుపై అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం జిల్లాకు చెందిన రెవెన్యూ, మునిసిపల్ మొదలైన విభాగాల RTI చట్టం కింద దాఖలు చేయబడిన అప్పీళ్లు / ఫిర్యాదులపై విచారణలు నిర్వహిస్తారు.
Similar News
News November 23, 2025
సిద్దిపేట: 25న వాడిన సామాగ్రి వేలంపాట

వాడిన ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, టెంట్లు ఇతర సామాగ్రికి 25న జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ (పెద్ద కోడూరు శివారు)లో వేలంపాట వేస్తున్నట్టు సీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు వేలంపాట ప్రదేశానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాలకు 87126 67416, 87126 67422 సంప్రదించాలన్నారు.
News November 23, 2025
సిద్దిపేట: మొదటి మహిళా డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి

2014లో సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత మూడు సార్లు డీసీసీ కమిటీ ఏర్పడింది. అందులో మొదటి, 2వ సారి తూంకుంట నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహారించారు. 3వసారి ఆయన కూతురైన ఆంక్షారెడ్డి నియామకమయ్యారు. ఒక ఫ్యామిలీ నుంచి మూడు సార్లు ఈ పదవి పొందడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను ఆమె ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి!
News November 23, 2025
ఏటూరునాగారం: బియ్యం ఇవ్వాలంటే వాగు దాటాల్సిందే..!

ఏటూరునాగారం మండలంలో కొండాయి, మల్యాల గ్రామాల్లోని గిరిజనులకు జీసీసీ రేషన్ బియ్యం అందించడం విక్రయదారులకు సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం ఇవ్వాలంటే సేల్స్‌మెన్ వినయ్ కుమార్ వాగు దాటి, వేయింగ్ మెషిన్ పట్టుకొని మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వినయ్ తెలిపారు. రవాణా సౌకర్యం లేక ఈ ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.


