News November 21, 2025
నరసరావుపేట: డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

పల్నాడు జిల్లాలో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ కోసం ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించమన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు డీపీఆర్ నకలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు నరసరావుపేట జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
Similar News
News November 22, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
News November 22, 2025
బిచ్కంద: రోడ్డుపై వడ్లు.. ఒకరి ప్రాణం తీసింది!

వడ్ల కుప్ప కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బిచ్కుంద SI మోహన్ రెడ్డి వివరాలిలా..లచ్చన్ వాసి కీర్తి రాజ్ (35) బరంగ్ ఎడిగి నుంచి బిచ్కుంద వైపు తన బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఖత్గావ్ చౌరస్తా సమీపంలో ఆరబోసిన వరి ధాన్యం కుప్పను కీర్తి రాజ్ బైక్‌తో ఎక్కించి, అదుపు తప్పి రోడ్డుపై పడి, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు.
News November 22, 2025
యాషెస్ టెస్టు.. 847 బంతుల్లోనే ముగిసింది

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. అటు తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు 405 బంతులే(67.3 ఓవర్లు) ఎదుర్కొన్నారు. 1904 తర్వాత ఇంత తక్కువ ఓవర్లలో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులను ముగించడం ఇదే తొలిసారి.


