News November 21, 2025

వరంగల్‌లో ఈ నెల 22న జాబ్ మేళా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. సాత్విక కోరారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరగనుంది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మేళాకు అర్హులు.

Similar News

News November 22, 2025

సిరిసిల్ల: TG డయాగ్నోస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేసిన DMHO

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త నమూనాలను, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. వ్యాధులను అరికట్టడంలో జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని సిబ్బందికి సూచించారు. వ్యాధి నిరోధక టీకాలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

News November 22, 2025

సంగారెడ్డి: పోలీసులకు ఫిట్నెస్ కీలకం: ఎస్పీ

image

పోలీసులకు ఫిట్నెస్ కీలకమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.