News November 21, 2025

సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల కోసం దరఖాస్తులు: ఏడీ

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల కోసం నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఏడీ ముక్కంటి గురువారం తెలిపారు. ఒక వాహనం ఐదుగురు సభ్యులున్న గ్రూపునకు కేటాయిస్తారు. సఫాయి కర్మచారి సర్టిఫికెట్ తప్పనిసరి. ఆసక్తి గల వారు ఈ నెల 27 లోపు జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.

Similar News

News November 22, 2025

సిరిసిల్ల: TG డయాగ్నోస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేసిన DMHO

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త నమూనాలను, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. వ్యాధులను అరికట్టడంలో జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని సిబ్బందికి సూచించారు. వ్యాధి నిరోధక టీకాలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

News November 22, 2025

సంగారెడ్డి: పోలీసులకు ఫిట్నెస్ కీలకం: ఎస్పీ

image

పోలీసులకు ఫిట్నెస్ కీలకమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.