News April 15, 2024
వైరా: నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

నీటితొట్టిలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన వైరా మండలం కేజీ సిరిపురంలో చోటుచేసుకుంది. కూరాకుల గోపి, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. వృత్తి రీత్యా తండ్రి కూరాకుల గోపి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి వైరాలోని ఒక షాపులో వర్కర్ గా పని చేస్తుంది. ఈ క్రమంలో చిన్న కుమారుడు యశ్వంత్ (16 నెలలు) వారి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న సమయంలో అదుపుతప్పి సమీపంలో ఉన్న నీటితొట్టిలో పడిపోయి మృతి చెందాడు
Similar News
News November 11, 2025
ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
News November 11, 2025
ఖమ్మం కలెక్టర్‌ను కలిసిన నూతన DEO

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి(డీఈఓ)గా నియమితులైన చైతన్య జైని, బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 11, 2025
సదరమ్ సర్టిఫికెట్ల మంజూరుకు రూ.2 కోట్ల వసూళ్లు?

జిల్లాలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విభాగంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకల్య శాతాన్ని పెంచేందుకు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20-40 వేల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. నలుగురు ఉద్యోగులు బృందంగా ఈ అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగుల నుంచి వసూళ్లకు పాల్పడటమేంటని జిల్లా వాసులు మండిపడుతున్నారు.


