News November 21, 2025

SRCL: జిల్లా కలెక్టర్‌తో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గీతే ఇందులో హాజరయ్యారు.

Similar News

News November 24, 2025

అంతర్ జిల్లాల అండర్-17 ఖోఖో విజేత ప్రకాశం జిల్లా

image

కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-17 ఖోఖో ఛాంపియన్‌షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. విజేతలకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరై బహుమతి ప్రదానం చేశారు. ఈ టోర్నీలో ప్రకాశం జిల్లా విన్నర్‌గా, చిత్తూరు జిల్లా రన్నరప్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా ఖోఖో క్రీడల ద్వారా ఉద్యోగాలు పొందిన క్రీడాకారులను సత్కరించారు. పీఈటీలు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.

News November 24, 2025

ఇక సెలవు.. ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి

image

బాలీవుడ్ నటుడు <<18374925>>ధర్మేంద్ర<<>> (89) అంత్యక్రియలు ముగిశాయి. తొలుత ఆయన పార్థివ దేహాన్ని ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆయన్ను కడసారి చూసేందుకు సినీతారలు, అభిమానులు భారీగా వచ్చారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ తదితర సినీ తారలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తుది నివాళులు అర్పించారు.

News November 24, 2025

26న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

image

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.