News April 15, 2024
అనకాపల్లి: ‘వైసీపీ పాలనలో అంతులేని అవినీతి’

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి కనిపించలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఈ మేరకు అనకాపల్లి గవరపాలెం ఓ కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నియోజకవర్గంలో గత ఎన్నికలలో అమరనాథ్‌ను గెలిపించి తప్పు చేశామని, ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
Similar News
News October 7, 2025
‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు.
News October 7, 2025
సుజాతనగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2025
విశాఖ: ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటీస్‌లకు అవకాశం

ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో 2వ విడత ఐటీఐ అప్రెంటిస్‌షిప్ అలాట్‌మెంట్లను రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు మంగళవారం జారీ చేశారు. అప్రెంటిస్‌లు భద్రతా నియమాలు పాటిస్తూ నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసినవారికి ఖాళీలను బట్టి ఔట్‌సోర్సింగ్‌లో అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే 18 నెలల హెవీ లైసెన్స్ అనుభవం ఉన్నవారికి ఆన్-కాల్ డ్రైవర్లుగా అవకాశం ఉందని తెలిపారు.