News November 21, 2025

నేడు HYDకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ఇదే!

image

> తిరుమల పర్యటన ముగించుకుని మ.1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
> అక్కడి నుంచి నేరుగా ఆమె సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి, విశ్రాంతి తీసుకుంటారు.
> మ.3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.
> సా.4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.
> సా.6:15 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

Similar News

News November 22, 2025

కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

image

కంచరపాలెం రైతు బజార్‌కు 880 గ్రాములు క్యారేట్‌ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్‌ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్‌లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్‌లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.

News November 22, 2025

BOIలో 115 SO పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 22, 2025

కర్నూలు: సీఐ జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

image

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వింత ఘటన జరిగింది. పెద్దహోతూరుకు చెందిన యువరాజు మద్యం మత్తులో సీఐ రవిశంకర్ జీపును ఎత్తుకెళ్లాడు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా యువరాజు డ్రంకన్ డ్రైవ్‌లో బైక్‌తో పట్టుబడ్డారు. తన బైక్ ఇవ్వనందుకు పోలీసులను మరిపించి సీఐ జీపును తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇది గమనించిన యువరాజు సోదరుడు అంజి వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేర్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.