News November 21, 2025
HYDలో రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు, రేపు HYDలో పర్యటించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్, తిరుమలగిరి, కార్ఖానా, బేగంపేట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వీవీఐపీ ప్రయాణాల కారణంగా ఈ రెండు రోజుల్లో CTO, రసూల్‌పుర, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట, తిరుమలగిరి, AOC, అల్వాల్, లోతుకుంట తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కొంతసేపు నిలిపివేసే అవకాశం ఉందన్నారు.
Similar News
News November 21, 2025
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి కడప SP సాయం

కడపలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన AR హెడ్ కానిస్టేబుల్ నారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పోలీస్ సంక్షేమం కింద వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని మృతుడి సతీమణి రమాదేవికి శుక్రవారం అందించారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది మరణం బాధాకరమని ఎస్పీ పేర్కొంటూ, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News November 21, 2025
చిగురుమామిడి: ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి

చిగురుమామిడి మండలం సుందరగిరి, గంగిరెడ్డిపల్లి రోడ్డులో ట్రాక్టర్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. సుందరగిరి గ్రామానికి చెందిన గందె రాజయ్య టీవీఎస్ ఎక్సెల్‌పై తన పొలం నుంచి ఇంటికి వస్తుండగా, గంగిరెడ్డిపల్లి రోడ్డులోని బండ ప్రాంతం వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 21, 2025
HYD: తెలుగు వర్సిటీ.. 23న ఆడిటోరియం శంకుస్థాపన

సురవరం ప్రతాప రెడ్డి తెలుగు వర్సిటీ బాచుపల్లి క్యాంపస్లో ఈనెల 23న ఉదయం 11:30 గంటలకు ఆధునాతన ఆడిటోరియం శంకుస్థాపన చేయనున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యఅతిథిగా పద్మభూషణ్ వరప్రసాద రెడ్డి, విశిష్ట అతిథిగా రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ MD గణపతి రెడ్డి హాజరుకానున్నారు.


