News November 21, 2025

ADB: లోకల్ వార్.. అయోమయంలో బీసీలు

image

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రతిష్ఠ కొనసాగుతుండటంతో పార్టీ పరంగా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆమోదించాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1514 GPలు, 581 ZPTC, 69 MPTC స్థానాలు ఉండగా.. బరిలో నిలవాలనుకున్న బీసీలు అయోమయంలో ఉన్నారు.

Similar News

News November 21, 2025

నీటి నిల్వ, సంరక్షణ చర్యలను మెచ్చిన కేంద్రం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా డి.సీఎం పవన్ నేతృత్వంలో నీటి నిల్వ, సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు జల్ శక్తి అవార్డులు వరించాయి. పంచాయతీ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో మదనపల్లి మండలం, దుబ్బిగానిపల్లె, ద్వితీయ స్థానంలో ప్రకాశం(జి), పీసీ పల్లె(మం) మురుగమ్మి గ్రామం, జల్ సంచయ్-జన్ భాగీదారీలో దక్షిణ జోన్‌లో నెల్లూరు జిల్లాకు అవార్డు దక్కింది.

News November 21, 2025

‘వస్త్ర పరిశ్రమ సాధికారత.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక’

image

ఇందిరా మహిళ చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉపయోగపడుతుందని, మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతుందని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జిల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని, 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యతను చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

News November 21, 2025

సిద్దిపేట: వైద్య సిబ్బందిపై అగ్రహాం వ్యక్తం చేసిన కలెక్టర్

image

సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ వెరిఫై చేశారు. ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే విధులకు హాజరు కాగా, మెడికల్ ఆఫీసర్‌తో సహా మిగతా వారందరూ గైర్హాజరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.