News April 15, 2024

5 రోజుల్లో 600 విమానాలు.. IAF సాయం!

image

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి రాక నేపథ్యంలో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో 5 రోజుల్లోనే 600కంటే ఎక్కువ విమానాల రాకపోకలు జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ ఎయిర్‌ఫోర్స్ సాయాన్ని తీసుకుందట.

Similar News

News October 16, 2024

త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.

News October 16, 2024

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

TG: హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

News October 16, 2024

ఒక్క సినిమాకు రూ.125 కోట్లు తీసుకున్న స్టార్ హీరో!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాకు ఇప్పటికే రూ.264.31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం రజినీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపాయి. ఆయన ఏకంగా రూ.125 కోట్లు ఛార్జ్ చేశారట. జడ్జిగా నటించిన అమితాబ్ రూ.7 కోట్లు, రజినీ భార్యగా నటించిన మంజూ వారియర్ రూ.2-3 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.2-4 కోట్లు, రానా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారని తెలిపాయి.