News November 21, 2025
జిల్లాలో భారీగా పంటల కొనుగోలు: నిర్మల్ కలెక్టర్

పంటల కొనుగోలుపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 14,760.56 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు 5,746 క్వింటాళ్ల సోయా, 7,715 క్వింటాళ్ల మొక్కజొన్న, 66,140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Similar News
News November 23, 2025
సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
News November 23, 2025
విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.
News November 23, 2025
VZM: అక్కడ చురుగ్గా పనులు.. ఇక్కడ మాత్రం..!

ఉమ్మడి విజయనగరం జిల్లాలో బ్రిటిష్ కాలంనాటి వంతెనలు చాలా ఉన్నాయి. వాటిలో సీతానగరం, పారాది, కోటిపాం ప్రధానమైనవి. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఈ వంతెనలపై నుంచి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే వాహనాల రద్దీ పెరగడంతో వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పారాది, సీతానగరం వద్ద కొత్త వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ కోటిపాం వంతెన పనులకు అడుగులు పడకపోవడం గమనార్హం.


