News November 21, 2025

7వ తరగతి అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.

Similar News

News November 22, 2025

పార్లమెంటులో ‘అమరావతి’ బిల్లు: పెమ్మసాని

image

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించే గెజిట్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. CRDA కార్యాలయంలో మాట్లాడుతూ ‘రాజధాని రైతులకు 98% ప్లాట్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తాం. రాబోయే 15ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం సదుపాయాలు కల్పిస్తాం’ అని వివరించారు.

News November 22, 2025

బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ 4 కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bits-pilani.ac.in/

News November 22, 2025

నట్స్‌తో బెనిఫిట్స్: వైద్యులు

image

నిత్యం స్నాక్స్‌గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్‌ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.