News April 16, 2024

టుడే టాప్ స్టోరీస్

image

TG:కవిత బెయిల్ కోసం బీజేపీతో KCR కుమ్మక్కు: సీఎం రేవంత్
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ: CM
కవితకు ఈ నెల 23వరకు జుడీషియల్ కస్టడీ
ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తాం: ఉత్తమ్
TG:బంగారం ధరలు తగ్గాలంటే రాహుల్ PM కావాలి: జగ్గారెడ్డి
AP:ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది: సీఎం జగన్
AP:పేదల బాగు కోసమే నా తపన: చంద్రబాబు
సీఎంపై దాడి.. దర్యాప్తు అధికారుల్ని మార్చాలి: పవన్
RCBపై SRH విజయం

Similar News

News November 17, 2024

తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్ష

image

TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.

News November 17, 2024

BGT: నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించగల సత్తా ఉండటంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆయనను తుది జట్టులో ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. నితీశ్‌తోపాటు దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్‌లలో ఒకరు డెబ్యూ చేస్తారని టాక్.

News November 17, 2024

బీజింగ్‌లో చేసినట్లే ఢిల్లీలో చేయండి: నెటిజన్లు

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మితిమీరిపోతోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలుష్యం తగ్గట్లేదు. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్‌లో పన్నెండేళ్లలో తగ్గిపోయిన కాలుష్యం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అక్కడ 2012లో కాలుష్యంతో నిండిపోయి పొగ కమ్మేయగా.. ఇప్పుడు గాలి నాణ్యత పూర్తిగా మారిపోయింది. అలాంటి ఏర్పాట్లు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.