News November 21, 2025

HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

image

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్‌లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

మెదక్: రోడ్డు ప్రమాదాలతో ప్రాణ, ఆర్థిక నష్టం: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ, ఆర్థిక నష్టం జరుగుతున్న సందర్భంగా రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలలో గణనీయమైన తగ్గుదల సాధ్యమని పేర్కొన్నారు.

News November 21, 2025

అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

image

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్‌లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.

News November 21, 2025

పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

image

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.