News November 21, 2025
జగిత్యాల: దేవ్‌జీ ఎక్కడున్నారు..?

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన నేపథ్యంలో మావో పార్టీ ప్రధాన కార్యదర్శి, కోరుట్లవాసి తిరుపతి @ దేవ్‌జీ ఆచూకీ హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన తప్పించుకున్నారా? పోలీసుల అదుపులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. AP ఇంటెలిజెన్స్ ADGP మహేష్ చంద్ర.. దేవ్‌జీ తమ అదుపులో లేరని ప్రకటించడంతో ఆయన ఎక్కడ ఉన్నారనేది చర్చనీయాంశమైంది. భద్రతా బలగాలు ప్రస్తుతం ఆయన కోసమే గాలిస్తున్నాయి.
Similar News
News November 22, 2025
అచ్చంపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఈనెల 17న నారాయణపేట జిల్లా కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఈనెల 19న చనిపోయినట్లు అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు. అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా తనది అచ్చంపేట ప్రాంతమని చెప్పినట్లు ఆయన తెలిపారు. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీలో ఉందని ఇతనిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.
News November 22, 2025
GDనెల్లూరులో తారస్థాయికి వర్గపోరు..?

GDనెల్లూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. MLA థామస్, భీమనేని చిట్టిబాబు మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిచ్చు రాజేస్తోంది. భీమినేని చిట్టిబాబు జిల్లా అధ్యక్షుని పదవి రేసులో ఉన్నారు. దీనిని థామస్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారట. థామస్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా, చిట్టిబాబు వెంట నడుస్తున్నట్లు సమాచారం. ఇది ఎటు వెళుతుందో చూడాలి మరి.
News November 22, 2025
JNTU హైదరాబాద్‌కు అధికారిక గీతం విడుదల

దేశంలోని మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయమైన JNTU హైదరాబాద్‌కు ఇప్పుడు అధికారిక గీతం లభించింది. గీతాన్ని యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, గేయరచయిత డా. భూత్కూరి రాజేష్ ఖన్నా రచించగా, సంగీత దర్శకుడు యశోకృష్ణ స్వరపరిచారు. వీసీ టి.కిషన్‌కుమార్ రెడ్డి ఆలోచనతో ఇది రూపుదిద్దుకుంది. జేఎన్టీయూ గేయం విశ్వవిద్యాలయ గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తోంది అని డా.రాజేష్ ఖన్నా అభిప్రాయపడ్డారు.


