News November 21, 2025

సిద్దిపేట: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

image

సిద్దిపేట కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాం చుట్టూ వీక్షించి రక్షణ చర్యలను పరిశీలించారు. లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ అధికారులు 24/7 పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News November 24, 2025

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ గురించి మీకు తెలుసా..?

image

పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జిల్లాలో అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేయడానికి 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంస్థ 7281.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 21,36,660 జనాభాను కలిగి ఉంది. పల్నాడు పట్టణాభివృద్థి సంస్థ పరిధిలో 28 మండలాల్లోని 349 గ్రామాలు, 8 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా చిరుమామిళ్ల మధుబాబును ప్రభుత్వం ఇటీవల నియమించింది.

News November 24, 2025

TAKE A BOW.. 93 రన్స్, 6 వికెట్లు

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్సులో 8వ స్థానంలో వచ్చిన అతడు 91 బంతుల్లోనే 93 రన్స్ చేశారు. ఏకంగా 7 సిక్సర్లు బాదారు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది. అటు బౌలింగ్‌లో 6 కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. చక్కటి బౌన్సర్లతో మనోళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.

News November 24, 2025

భక్తులకు ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

image

AP: 2019-24 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఐదేళ్లలో 20కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ‘గత TTD బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తితో నమస్కరిస్తుంటే, వాళ్లు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తుంచేశారు’ అని ట్వీట్ చేశారు.