News April 16, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యం: కలెక్టర్, SP

image

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి గిద్దలూరు ఎంఆర్వో ఆఫీసు విజిట్ చేశారు. ఈసందర్భంగా ఆర్వో నాగజ్యోతి ద్వారా ఎన్నికల పర్యవేక్షణపై చేపట్టిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Similar News

News July 4, 2025

ఎస్పీ గారు.. థ్యాంక్యూ: పవన్ కళ్యాణ్

image

తన పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంపై ఎస్పీ దామోదర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా అభినందించారు. మార్కాపురం పర్యటన అనంతరం హెలిప్యాడ్ వద్ద ఎస్పీని పవన్ ప్రత్యేకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. అలాగే జిల్లాలో శాంతి భద్రతల స్థితిగతులు సైతం మెరుగ్గా ఉన్నాయని పవన్ చెప్పడం విశేషం.

News July 4, 2025

మార్కాపురం జిల్లాపై మాటెత్తని పవన్..!

image

మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురాన్ని ఎప్పుడు జిల్లా చేస్తామనే దానిపై ఆయన ప్రకటన చేస్తారని ఆశగా చూశారు. కానీ మార్కాపురం జిల్లాపై ఆయన ఏం మాట్లాడలేదు. వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులను తానే పర్యవేక్షిస్తూ 20నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.

News May 8, 2025

పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

ఒంగోలు మండలం త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా గురువారం సందర్శించారు. అక్కడ పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయమైన ధర వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.