News November 21, 2025

పాయకరావుపేట: ఉపాధ్యాయురాలు మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి

image

పాయకరావుపేట మండలం రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు జోష్నాబాయి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిపి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి X లో పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Similar News

News November 21, 2025

ములుగు: కాంగ్రెస్-బీజేపీ కుట్ర తేట తెల్లమైంది: బడే నాగజ్యోతి

image

బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్-బీజేపీ పార్టీలు పన్నిన కుట్రలు తేట తెల్లం అవుతున్నాయని ములుగు జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫార్ములా ఈ-కార్ రేస్ నెపంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి తెలపడం కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందంలో భాగమేనన్నారు.

News November 21, 2025

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి కడప SP సాయం

image

కడపలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన AR హెడ్ కానిస్టేబుల్ నారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పోలీస్ సంక్షేమం కింద వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని మృతుడి సతీమణి రమాదేవికి శుక్రవారం అందించారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది మరణం బాధాకరమని ఎస్పీ పేర్కొంటూ, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

News November 21, 2025

చిగురుమామిడి: ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి

image

చిగురుమామిడి మండలం సుందరగిరి, గంగిరెడ్డిపల్లి రోడ్డులో ట్రాక్టర్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. సుందరగిరి గ్రామానికి చెందిన గందె రాజయ్య టీవీఎస్ ఎక్సెల్‌పై తన పొలం నుంచి ఇంటికి వస్తుండగా, గంగిరెడ్డిపల్లి రోడ్డులోని బండ ప్రాంతం వద్ద ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.