News November 21, 2025
ANU: తప్పు మీద తప్పు.. ఒకే ప్రశ్న మూడుసార్లు!

ANU పీజీ పరీక్షలు నిర్వహణలో తప్పిదాలు ఆగడం లేదు. <<18322201>>నమూనా పేపర్లు వాడిన గందరగోళంపై <<>>విమర్శలు ఇంకా చల్లారక ముందే, శుక్రవారం జరిగిన Mcom పరీక్షలో ఒకే ప్రశ్న మూడు సార్లు రావడం, పరీక్షను గంట పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభించడం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తాత్కాలిక పాలనలో నడుస్తున్న ఈ నిర్లక్ష్యానికి ముగింపు పలికి, నిర్వహణను క్రమబద్ధం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Similar News
News November 23, 2025
స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.
News November 23, 2025
బహ్రెయిన్- HYD విమానానికి బాంబు బెదిరింపు కాల్

బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయ్యి శంషాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. తెల్లవారుజామున 4:20కి ఫ్లైట్ అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
News November 23, 2025
కోహెడ: మహిళలు శక్తి స్వరూపులు: కలెక్టర్

మహిళలు శక్తి స్వరూపులని ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాల్గొని ఆమె మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సంఘటితమై ప్రభుత్వ సహకారంతో వ్యాపార రంగంలో నేడు మహిళలు రాణిస్తున్నారని అన్నారు.


