News November 21, 2025
వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయనను వేములవాడకు బదిలీ చేస్తూ శుక్రవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడలో అదనపు ఎస్పీ హోదాలో పనిచేస్తున్న శేషాద్రిని రెడ్డిని జగిత్యాల అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమించారు.
Similar News
News November 21, 2025
BREAKING: ములుగు జిల్లాలో దారుణ ఘటన

ములుగు జిల్లాలో దారుణ ఘటన ఈరోజు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంకటాపూర్ మండలంలో ఓ మైనర్ బాలికపై వరుసకు పెదనాన్న అయ్యే 75 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ములుగు డీఎస్పీ దర్యాప్తు జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News November 21, 2025
సిద్దవటం వద్ద అసిస్టెంట్ కమిషనర్ కారుకు ప్రమాదం

సిద్దవటం మండలంలోని కనుములోపల్లి వద్ద శుక్రవారం అసిస్టెంట్ కమిషనర్ కారు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. కడప నుంచి భాకరాపేట వస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించక బ్రేక్ వేయడంతో అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
News November 21, 2025
ములుగు: సరిహద్దు జిల్లాల్లో సమర్థులైన అధికారులు..!

వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ అంతిమ దశకు చేరినప్పటికీ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తతల వేడి ఏమాత్రం చల్లారలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎస్పీల బదిలీని అనివార్యంగా అమలు చేస్తూనే ఆ ఖాళీలను సమర్థులైన అధికారులతో భర్తీ చేసింది. ములుగు ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్, భూపాలపల్లి ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్‌ను నియమించింది. వీరిద్దరూ గతంలో ములుగు జిల్లాలో పనిచేసిన వారే.


