News November 21, 2025
వేములవాడ: ‘అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా పదోన్నతి కల్పించాలి’

అంగన్వాడీ ఆయాలుగా పనిచేస్తున్న అర్హత కలిగిన వారికి టీచర్లుగా పదోన్నతి కల్పించాలని AITUC జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, ప్రధాన కార్యదర్శి కడారి రాములు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. సీనియారిటీ, సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే పూర్తయిందని, రోజులు గడుస్తున్నప్పటికీ నియామకాలు చేపట్టడం లేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
Similar News
News November 22, 2025
హుజురాబాద్‌లో దూరవిద్య తరగతులు ప్రారంభం

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు దూర విద్యా తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయని హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఇందిరా దేవి, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ కె.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు.
News November 22, 2025
కంచిలి: “సేవలను సద్వినియోగం చేసుకోవాలి”

కంచిలి మండలం ఎంఎస్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను శనివారం రాష్ట్ర పీఎంశ్రీ పాఠశాలల సీనియర్ లెక్చలర్ పుల్లట రమేష్ సందర్శించారు. పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల నిధులు మంజూరు చేస్తుందని పుల్లట రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ-2 కుంబి చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<


