News November 21, 2025
తిరుపతి: ఆధార్ తప్పులతో ఆగిన ఆపార్..!

ఎన్ఈపీలో భాగంగా ఆధార్ లింక్‌తో విద్యార్థులకు ఆపార్ అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 3,86,167 మంది ఉన్నారు. ఆపార్ వచ్చిన విద్యార్థులు 3,35,534 మంది కాగా.. పెండింగ్‌లో 50,633 మంది విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆపార్ నంబర్ తప్పనిసరి కావాల్సి ఉంది. ఇంటి పేర్లు, పుట్టిన తేదీల్లో ఎక్కువ శాతం తప్పులు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది.
Similar News
News November 21, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 112 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 112 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 54 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
News November 21, 2025
ములుగు జిల్లా పర్యాటకానికి ఊతమివ్వండి: కేంద్ర మంత్రికి సీతక్క వినతి

ములుగు జిల్లాలో ఎకో ఫ్రెండ్లీ టూరిజం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను కలిసిన సీతక్క ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. మల్లూరు దేవస్థానం అభివృద్ధికి రూ.30 కోట్లు, బోగత జలపాతం అభివృద్ధికి రూ.50 కోట్లు, మేడారం జంపన్న వాగు అభివృద్ధికి మరో రూ.50 కోట్ల నిధులను కేటాయించాలని కోరారు.
News November 21, 2025
మేడారం జాతరకు రండి.. రాష్ట్రపతిని ఆహ్వానించిన సీతక్క

మేడారం మహా జాతరకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్ర మంత్రి సీతక్క ఆహ్వానించారు. HYD బొల్లారంలో జరిగిన భారతీయ కళా మహోత్సవ్ -2025 కార్యక్రమంలో ఈమేరకు రాష్ట్రపతికి తెలంగాణ సమాజం తరఫున ఆహ్వానం పలికారు. జాతరలో పాల్గొంటే ఆదివాసీ గిరిజనులకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. ఒడిశాకు చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, త్రిపురకు చెందిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆదివాసీ మూలాలు ఉన్నాయన్నారు.


