News November 21, 2025
నాగర్‌కర్నూల్ నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. బదిలీల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రంగనాథ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సంగ్రామ్ సింగ్ పాటిల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News November 21, 2025
కడప కలెక్టరేట్‌లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

కడప కలెక్టరేట్‌లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
News November 21, 2025
భూపాలపల్లి: గ్రామాల్లో మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీ

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లోని గ్రామాలకు మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీచేస్తూ కలెక్టర్ నుంచి ప్రకటన వెల్లడించారు. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు స్థానికులై అదే మండలానికి చెందినవారై ఉండాలని, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
News November 21, 2025
హైదరాబాద్ RRR రీ సర్వే తప్పనిసరి: కవిత

రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాటలో కవిత పర్యటన సాగుతుంది. RRR భూసేకరణలో అక్రమాలు జరిగాయని, రీ–సర్వే తప్పనిసరి అని ఆమె డిమాండ్ చేశారు. చెరువుల కబ్జాలు, ఆర్ఆర్ఆర్ ఆలైన్‌మెంట్ మార్పుల పెద్దల కోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఒక్క న్యాయం పెద్దలకు మరో న్యాయమా? అంటూ కవిత నిలదీశారు.


