News April 16, 2024

ఒక రికార్డ్ పోతేనేం.. మరొకటి నమోదైంది!

image

SRHతో మ్యాచ్‌లో RCB సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఛేదనలో 250 రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో RCB పోగొట్టుకున్న అత్యధిక స్కోర్ (263) రికార్డును ఇది భర్తీ చేసినట్లు అయింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో RCB అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసిన SRH (277).. నిన్నటి మ్యాచ్‌లో 287 కొట్టి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. తమ రికార్డ్ బ్రేక్ చేసిన జట్టుపైనే RCB కొత్త రికార్డ్ సాధించడం గమనార్హం.

Similar News

News January 29, 2026

ఆనందం డబుల్.. గ్రూప్-2 కొట్టిన భార్యాభర్తలు

image

AP: తాజా గ్రూప్-2 <<18979288>>ఫలితాల్లో<<>> అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు సత్తా చాటారు. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. HYDలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరూ జాబ్ కొట్టడంతో వారింట ఆనందం రెట్టింపయ్యింది. కాగా 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.

News January 29, 2026

డెలివరీకి సిద్ధంగా ఉన్నారా?

image

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇంట్లోకి సంతోషం వచ్చేస్తుంది. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏది అవసరమో.. ఏది కాదో చూసి కొనుక్కోవాలి. ఎమర్జెన్సీ కోసం కాస్త డబ్బు దాచి ఉంచాలి.

News January 29, 2026

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఛార్జ్‌షీట్‌లో ఏముంది?

image

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల CBI సిట్ ఫైల్ చేసిన ఛార్జ్‌షీట్‌లో కీలకాంశాలు ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఆ నెయ్యిలో కొలెస్ట్రాల్ లేనట్లు NDDB రిపోర్టులో తేలిందని, అంటే జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినట్లు చెబుతున్నాయి. మరోవైపు పాలు/వెన్న సేకరించకుండా రిఫైన్డ్ పామాయిల్, బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ వంటి రసాయనాలతో నెయ్యి లాంటిది తయారు చేశారని వార్తలొస్తున్నాయి.