News November 21, 2025

ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాలు: కలెక్టర్

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మీకోసం రైతన్న కార్యక్రమాన్ని ప్రతి మండలంలో నిర్వహిస్తూ రైతు అభ్యున్నతికి సూచనలు సలహాలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News November 22, 2025

శ్రీకాకుళం: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

News November 22, 2025

బాపట్ల: ‘భూ సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలి’

image

భూ సమస్యలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి భూ అర్జీని నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్‌డీఓలు పాల్గొన్నారు.

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

image

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.