News November 22, 2025
రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు 10AM నుంచి 8PM వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పశ్చిమ భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, మంత్రి అనసూయ సీతక్క హాజరయ్యారు.
Similar News
News November 22, 2025
కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

కంచరపాలెం రైతు బజార్‌కు 880 గ్రాములు క్యారేట్‌ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్‌ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్‌లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్‌లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.
News November 22, 2025
BOIలో 115 SO పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/
News November 22, 2025
కర్నూలు: సీఐ జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వింత ఘటన జరిగింది. పెద్దహోతూరుకు చెందిన యువరాజు మద్యం మత్తులో సీఐ రవిశంకర్ జీపును ఎత్తుకెళ్లాడు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా యువరాజు డ్రంకన్ డ్రైవ్‌లో బైక్‌తో పట్టుబడ్డారు. తన బైక్ ఇవ్వనందుకు పోలీసులను మరిపించి సీఐ జీపును తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇది గమనించిన యువరాజు సోదరుడు అంజి వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేర్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


