News April 16, 2024

శ్రీరామ నవమి రోజు భక్తులందరికీ ఉచిత దర్శనం

image

భద్రాద్రి శ్రీరామచంద్రుడి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ, భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈనెల 17 న సీతారాముల కళ్యాణం రోజు భక్తులు ఉచిత దర్శనం చేసుకోవచ్చని ఈఓ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు శీఘ్ర దర్శనం కొరకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఆ రోజు ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అమె తెలిపారు.

Similar News

News October 12, 2024

మధిర: వాహన పూజలు చేసిన డిప్యూటీ సీఎం

image

విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం మధిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వాహన పూజా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని, సుఖ సంతోషాలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తన క్యాంపు కార్యాలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.

News October 12, 2024

కొత్తగూడెం: తాలిపేరు నదిలో పడి ఇద్దరు యువకులు మృతి

image

పండగ రోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామం పరిధిలోని తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి చనిపోయారు. మృతులు చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గట్టుపల్లి జంపన్న (23), సోయంలచ్చి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 12, 2024

ఖమ్మం: శ్రీలక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

image

విజయ దశమి పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీ స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ పండితులు, అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమర్తపు మురళీ, గిడ్డంగుల ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఉన్నారు.