News November 22, 2025
MBNR: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు..!

వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసే గ్రామాలకు రూ.10 లక్షల ప్రొత్సాహకం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. మహబూబ్‌నగర్ 441, నాగర్‌కర్నూల్ 461, నారాయణపేట 280, వనపర్తి 268, గద్వాల్ 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
Similar News
News November 22, 2025
బీస్ట్ మోడ్‌లో సమంత

ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న నటి సమంత సడన్‌గా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లారు. తాజాగా తన ఫిట్‌నెస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె తన బ్యాక్, ఆర్మ్స్ మజిల్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ తన అథ్లెటిక్ బాడీని చూపించారు. ఒకప్పుడు ఇలాంటి బాడీ తనకు సాధ్యం కాదని అనుకున్నానని, కానీ ఇప్పుడు సాధించానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె ఫిట్‌నెస్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
News November 22, 2025
యాపిల్ కంటే చిన్న పసికందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ముంబైలో 350 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి 124 రోజుల పాటు NICUలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ కావడం అద్భుతంగా నిలిచింది. జూన్ 30న ప్రీమెచ్యూర్‌గా (25 వారాల గర్భధారణ) జన్మించిన ఈ బిడ్డ యాపిల్ కంటే చిన్నగా ఉండేది. పుట్టిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఇటీవల డిశ్చార్జ్ అయింది. బిడ్డ బరువు 1.8 కిలోలకు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు బతికిన అత్యంత తక్కువ బరువున్న శిశువుగా నిలిచింది. (PC: TOI)
News November 22, 2025
చెల్పూర్ కేటీపీపీలో సాంకేతిక లోపం

భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లోని మొదటి, రెండవ దశల్లో సాంకేతిక లోపం కారణంగా ఒకేసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు దశలలో కలిపి 1,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.కోట్లలో నష్టంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి మరమ్మతు చేసే పనిలో నిమగ్నమయ్యారు.


