News November 22, 2025
వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

మార్గశిర మాసం సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. దేవస్థానం పరిసరాలు భక్తి శ్రద్ధలతో సందడిగా మారాయి.
Similar News
News November 23, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి సమీక్ష

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్, సివిల్ సప్లై అధికారులతో కలిసి కొనుగోలు పురోగతిని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా, పారదర్శకంగా కొనుగోలు జరగాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు, వాహనాలు, హమాలీలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని సూచించారు.
News November 23, 2025
బీసీసీఐ ట్రోఫీకి సిద్దిపేట యువకుడు

బీసీసీఐ నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీ హెచ్‌సీఏ టీమ్‌లోకి సిద్దిపేటకు చెందిన క్రీడాకారుడు అర్ఫాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. నవంబర్ 26 నుంచి కోల్‌కతాలో జరిగే ఈ టోర్నమెంట్‌లో అహ్మద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కలకుంట్ల మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేస్తూ అర్ఫాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
News November 23, 2025
రోజూ నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌తో సతమతమవుతున్న వారికి నవ్వు ఉత్తమ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి, మనసుకు అపారమైన లాభాలు కలుగుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్-2 డయాబెటిస్‌ను, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు సహజ పెయిన్‌కిల్లర్‌లా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.


