News November 22, 2025

జనగామ: మూడు విడతల్లో పంచాయతీ సమరం..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల సరళి ప్రారంభమైంది. డ్రాఫ్ట్ రూపంలో రిజర్వేషన్లు సిద్ధం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి విడతలో జనగామ, లింగాలఘనపురం, నర్మెట్ట, తరిగొప్పుల, రెండో విడతలో బచ్చన్నపేట, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, మూడో విడతల్లో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్ మండలాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News November 23, 2025

స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.

News November 23, 2025

బహ్రెయిన్- HYD విమానానికి బాంబు బెదిరింపు కాల్

image

బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయ్యి శంషాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. తెల్లవారుజామున 4:20కి ఫ్లైట్ అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.

News November 23, 2025

కోహెడ: మహిళలు శక్తి స్వరూపులు: కలెక్టర్

image

మహిళలు శక్తి స్వరూపులని ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆదివారం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాల్గొని ఆమె మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సంఘటితమై ప్రభుత్వ సహకారంతో వ్యాపార రంగంలో నేడు మహిళలు రాణిస్తున్నారని అన్నారు.