News April 16, 2024
దక్షిణాదిలో వితంతు వివాహాలకు ఆద్యుడు ఈయనే
సామాజిక సంఘ సంస్కర్తల్లో ముందు వరుసలో ఉండే పేరు కందుకూరి వీరేశలింగం. తన రచనలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించారు. నేడు ఆయన జయంతి. బాల్యవివాహాల రద్దుకు ఆయన కృషి చేశారు. తన మిత్రులతో కలిసి దక్షిణ భారతదేశంలోనే తొలి వితంతు వివాహం జరిపించారు. ఆధునికాంధ్ర పితామహుడిగా పేరొందిన కందుకూరి సాహితీరంగంలో విశేష కృషి చేశారు. ఆంధ్రకవుల చరిత్రము, రాజశేఖర చరిత్రము వంటి రచనలు చేశారు.
Similar News
News November 18, 2024
ఢిల్లీలో తగ్గిన గాలి నాణ్యత.. సీఎం కీలక ఆదేశాలు
ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవడంతో సీఎం ఆతిశీ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టేజ్-4 ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 10, 12వ తరగతి విద్యార్థులకు తప్పా మిగతా వారికి ఫిజికల్ క్లాసులు నిర్వహించవద్దని ట్వీట్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు నగరంలోకి ట్రక్కుల ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది.
News November 18, 2024
3 రోజుల్లో రూ.127.64 కోట్ల వసూళ్లు
సూర్య, దిశా పటానీ కాంబినేషన్లో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.127.64 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
News November 18, 2024
డిసెంబర్ 15 నాటికి కొత్త విధానం: నారాయణ
AP: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించామని నెల్లూరులో అధికారులతో సమీక్షలో మంత్రి చెప్పారు. ప్రజలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.