News November 22, 2025
పుట్టపర్తికి చేరుకున్న సీఎం, మంత్రి లోకేశ్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తికి చేరుకున్నారు. వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం, లోకేశ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం వారు ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
Similar News
News November 25, 2025
తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే?

పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర, పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, పూలమాలలు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, ఒకే పడి(51) వడలు, ఒకే పడి(51) అప్పాలు, ఒకే పడి (51) దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి.. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇస్రో-<


