News November 22, 2025
అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కల ‘ధర’హాసం..!

అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కలు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతవారం కిలో రూ.250 ధర ఉండగా శనివారం 300కి చేరిందని స్థానికులు తెలిపారు. అతి చల్లని ప్రదేశాలు ఉన్న చింతపల్లి, పాడేరు, ముంచింగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో కొండలపై గిరిజనులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో పంటకు తీవ్రంగా నష్టం వచ్చిందని రైతులు అంటున్నారు. దిగుబడి లేక రేటు పెరిగిపోతుందన్నారు.
Similar News
News November 22, 2025
వందల మందిని కాపాడే ఏఐ పరికరం.. అభినందించాల్సిందే!

హిమాచల్ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎంతో మంది చనిపోతుంటారు. అలాంటి ప్రమాద మరణాలను తగ్గించేందుకు IIT మండికి చెందిన డా.కళా వెంకట ఉదయ్ టీమ్ అతి తక్కువ ఖర్చుతో AI వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది 90% పైగా కచ్చితత్వంతో 3 గంటల ముందుగానే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. దీని సెన్సార్లు భూమి కదలిక, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి ప్రమాదానికి ముందు అలర్ట్ చేస్తుంది.
News November 22, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులు

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cdri.res.in
News November 22, 2025
సూర్యాపేట: ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ కృషి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్‌ను ఆయన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి పరిశీలించారు. ప్రతి వాహనదారుడి భద్రత ముఖ్యమన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు సైతం రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ నరసింహ కోరారు.


