News November 22, 2025
అచ్చంపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఈనెల 17న నారాయణపేట జిల్లా కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఈనెల 19న చనిపోయినట్లు అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు. అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా తనది అచ్చంపేట ప్రాంతమని చెప్పినట్లు ఆయన తెలిపారు. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీలో ఉందని ఇతనిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Similar News
News November 23, 2025
వరంగల్: ఇవేం రేషన్ కార్డులు..?

ఆయన ముఖ్యమంత్రి కాదు. అలాగని మంత్రి కాదు. కనీసం MLA కూడా కాదు. అయినా అతని ఫొటోలతో కూడిన రేషన్ కార్డులను పంచుతున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కాంగ్రెస్ నేత ఒకరు తన ఫొటో, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఫొటోలతో కూడిన రేషన్ కార్డులను పంచుతుండటం చర్చనీయాంశమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున పంచుతున్నట్లు ఆ కార్డులో ఉంది. ఇలాంటి రేషన్ కార్డులపై మీరేం అంటారు.
News November 23, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి సమీక్ష

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్, సివిల్ సప్లై అధికారులతో కలిసి కొనుగోలు పురోగతిని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా, పారదర్శకంగా కొనుగోలు జరగాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు, వాహనాలు, హమాలీలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని సూచించారు.
News November 23, 2025
బీసీసీఐ ట్రోఫీకి సిద్దిపేట యువకుడు

బీసీసీఐ నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీ హెచ్‌సీఏ టీమ్‌లోకి సిద్దిపేటకు చెందిన క్రీడాకారుడు అర్ఫాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. నవంబర్ 26 నుంచి కోల్‌కతాలో జరిగే ఈ టోర్నమెంట్‌లో అహ్మద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కలకుంట్ల మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేస్తూ అర్ఫాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


