News November 22, 2025

మార్చురీలో వసూళ్లు.. ఉద్యోగులకు ఉద్వాసన

image

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాల పోస్టుమార్టం కోసం సహాయకులు <<18326791>>డబ్బులు వసూలు<<>> చేస్తున్నట్లు Way2Newsలో పబ్లిష్ అయిన కథనానికి అధికారులు స్పందించారు. వసూళ్లు రుజువు కావడంతో పాల్పడుతున్న సహాయకులను బాధ్యతల నుంచి తప్పిస్తూ సూపరింటెండెంట్ డా.ఎం.నరేందర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మృతదేహాల ఫొటోగ్రాఫర్ సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలియడంతో, అతణ్ని విధులకు రావొద్దని ఆదేశించారు.

Similar News

News November 22, 2025

HYD: లక్ష్య సాధనకు నిరంతర అధ్యయనం ముఖ్యం: కలెక్టర్

image

విద్యార్థులు లక్ష్య సాధనకు సిద్ధమై, నిరంతరం అధ్యయనం కొనసాగించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి అన్నారు. నారాయణగూడలోని రాజా బహుదూర్ వెంకటరామి రెడ్డి ఉమెన్స్ కాలేజీలో శనివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ అచ్యుతాదేవి, ప్రొఫెసర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News November 22, 2025

తూ.గో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పేర్కొన్నారు. 75.54 శాతం మార్కులతో జిల్లా ఈ ఘనత సాధించిందన్నారు. సేవల్లో నాణ్యత, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల నిర్వహణతో ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

News November 22, 2025

బోయినిపల్లి: ‘బాల్యంలోనే TARGET ఫిక్స్ చేసుకోవాలి’

image

విద్యార్థులు బాల్యంలోనే లక్ష్యాన్ని ఎంచుకోని దాని సాధనకు కృషి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని KGBVని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6, 9వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. తాము కోరుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.