News November 22, 2025

సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను జిల్లా వ్యాప్తంగా వైభవంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. ఈ ఏడాది సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా ప్రతీ మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కలెక్టర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

ఎడారిగా మారిన గుంపుల మానేరు వాగు

image

ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరు నదిపై ఉన్న చెక్ డ్యాం కూలిపోవడంతో నది ఎడారిని తలపిస్తోంది. కార్తీక మాసం నవంబర్ 5న వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చిన మానేరు, కేవలం 15 రోజుల్లోనే నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతులు, శ్రీ రామభద్ర ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చొరవ తీసుకుని చెక్ డ్యాంను పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

News November 23, 2025

వికారాబాద్‌‌‌లో‌ కాంగ్రెస్ కీలక నేత రాజీనామా.?

image

వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ధారసింగ్ ఐ కమాండ్ నియమించిన విషయం తెలిసిందే. అయితే వికారాబాద్ కీలక నేత అసంతృప్తి చెందారు. అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఓ ముఖ్యమైన నాయకుడు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతను పార్టీ మారితే వికారాబాద్ పరిస్థితి ఏమవుతుందో అని భారీగానే చర్చలు వినిపిస్తున్నాయి. పార్టీ పెద్దల నుంచి బుజ్జగింపుల నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.

News November 23, 2025

రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

image

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్‌పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్‌ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్‌కు పాలనాధికారం ఉంది.