News November 22, 2025

SRCL: ‘ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి’

image

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, గజసింగవరం, గోరంటాల, గంభీరావుపేట, లింగన్నపేట, ముస్తఫానగర్, ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, పదిర, రాగట్లపల్లి, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, తిమ్మాపూర్, కిషన్ దాస్ పేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తనిఖీ చేశారు.

Similar News

News November 23, 2025

చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు గ్రీవెన్స్ డే

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 23, 2025

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం

image

డా. బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అధ్యయన కేంద్రంలో ఆదివారం డిగ్రీ 1, 3, 5 వ సెమిస్టర్, పి.జీ. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. అధ్యయన కేంద్రం వసతులు, నియమ నిబంధనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర – ఆర్డినేటర్ డా. కె. రంజిత, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

News November 23, 2025

ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా రాజేశ్వర్

image

తెలంగాణ ఎయిడ్స్ కౌన్సిలర్ కంట్రోల్ యూనియన్(టీఏసీసీయూ) రాష్ట్ర కార్యదర్శిగా మెదక్‌కు చెందిన కాముని రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ గతంలో జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బి.రామణా రెడ్డి ఎన్నికయ్యారు.