News November 22, 2025
కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్‌పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Similar News
News November 24, 2025
బెల్లంపల్లి: ‘రైతు బిడ్డలు.. మీకెందుకు ఇవన్నీ’

ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురిచేస్తోందని.. తల్లిదండ్రులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు రాసిన లేఖ జిల్లాలో సంచలనం రేపింది. బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ సమస్యలు విన్నవిస్తే ‘మీరు రైతు బిడ్డలు మీకెందుకు ఇవన్నీ’ అని అంటుందని అందులో పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్
News November 24, 2025
కొత్తగూడెం: ‘పోలీస్ వాహనాలు కండిషన్‌లో ఉంచాలి’

పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండీషన్‌లో ఉంచుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు వాహనాలను సోమవారం ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ డ్రైవర్స్ సమస్యలు, డ్యూటీలో భాగంగా వారి పనితీరును గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని వాహనాలను కండిషన్‌లో ఉంచాలని సూచించారు.
News November 24, 2025
మంచిర్యాల: దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సంబంధిత అధికారులతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. పాత మంచిర్యాలకు చెందిన లచ్చయ్య వేంపల్లి శివారులోని పట్టా భూమిలో ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన విద్యుత్తు స్తంభాలను మరోచోటికి మార్చాలని కోరారు.


