News November 22, 2025
‘వాలంటీర్’పై పెద్దిరెడ్డి కామెంట్స్.. మీరేమంటారు.?

ఇకపై తమ ప్రభుత్వంలో ‘<<18352308>>వాలంటీర్ వ్యవస్థ<<>>’ ఉండదన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సంక్షేమ ఫలాలను అందించే విధంగా జగన్ దీనిని ఏర్పాటు చేశారు. ఓ రకంగా ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ వ్యవస్థ కారణం అని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట. దీంతో 2029లో YCP అధికారం చేపట్టినా వాలంటీర్ వ్యవస్థపై మొగ్గు చూపే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.
Similar News
News November 24, 2025
KNR: స్థానిక పోరుకు సిద్ధమా..?

ఉమ్మడి KNR జిల్లాలో పంచాయతీ పోరుకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు పూర్తి చేశారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేఫథ్యంలో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నచోట పోటీకి సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లు అనుకూలం లేనిచోట అనుచరులను బరిలో నిలిపి స్థానికంగా పట్టు నిలుపుకోవాలని నాయకులు భావిస్తున్నారు. KNR జిల్లాలో 318గ్రామాలకు సర్పంచులు, 2,962 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
News November 24, 2025
అనకాపల్లి: రిజర్వాయర్‌లో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం

రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్లో గల్లంతైన మృతదేహం సోమవారం ఉదయం లభ్యమయింది. కొత్తకోట గ్రామానికి చెందిన గుమ్ముడు వాసు (29) ఆదివారం రిజర్వాయర్‌లో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రావికమతం అగ్రిమాపక కేంద్ర సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు.
News November 24, 2025
తెనాలి పన్నీర్ జిలేబీ.. యమా టెస్ట్ గురూ.!

ఆంధ్రాప్యారిస్ తెనాలి అంటేనే నోరూరించే జిలేబీకి ఎంతో ఫేమస్. బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ ఇప్పటి వరకు తెలుసు. లేటెస్ట్‌గా వాటి సరసన చేరింది పన్నీర్ జిలేబీ. పట్టణంలోని జిలేబీ కొట్ల బజారులో శని, ఆదివారాల్లో స్పెషల్ పన్నీర్ జిలేబీని సిద్ధం చేస్తున్నారు. కిలో రూ.600 చొప్పున లభిస్తున్న నోరూరించే పన్నీర్ జిలేబీని ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. మీరూ టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి..!


