News April 16, 2024
ఎచ్చెర్ల: కౌన్సెలింగ్ డేట్ ప్రకటన

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశానికి మిగిలిన సీట్లు భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులు హాజరు కావాలని గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ బాలాజీ ప్రకటించారు. ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులలో బాలురకు ఈనెల 18వ తేదీన దుప్పలవలస గురుకుల పాఠశాలలో, 19న బాలికలకు పెద్దపాడు గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
Similar News
News April 23, 2025
శ్రీకాకుళం : టెన్త్ రిజల్ట్స్.. 23,219 మంది పాస్

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 28,176 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,219 మంది పాసయ్యారు. 14,287 మంది బాలురు రాయగా 11,358 మంది పాసయ్యారు. 13,889 మంది బాలికలు పరీక్ష రాయగా 11,861 మంది పాసయ్యారు. 82.41 పాస్ పర్సంటేజ్ తో శ్రీకాకుళం జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలవగా.. 14వ స్థానానికి పడిపోయింది.
News April 23, 2025
SKLM: ఐఏఎస్‌గా ఎంపికైన యువకుడికి కేంద్రమంత్రి అభినందన

ఈ ఏడాది UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు బన్న వెంకటేశ్ ఆల్ ఇండియా 15వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆయనను ఫోన్‌లో అభినందించారు. వెంకటేశ్ తండ్రితో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకి గర్వకారణంగా ఉందని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలన్నారు.
News April 23, 2025
శ్రీకాకుళం : డైట్ కళాశాలలో పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూలు

శ్రీకాకుళం జిల్లాలోని వమరవల్లిలోని డైట్ కళాశాలలో ఎస్ఎస్ టీసీ ప్రాతిపదికన డిప్యుటేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. డైట్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5 సీనియర్ లెక్చలర్లు, 17 లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఆయా అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలన, ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.