News November 22, 2025
సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి

AP: సత్యసాయి బాబా సిద్ధాంతాలు, సూత్రాలే నిజమైన విద్య అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో పట్టభద్రులైన వారికి పట్టాలు అందజేసి మాట్లాడారు. ‘ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం. ఆధునిక విధానాలతో పాటు సంప్రదాయాలను పాటించాలి. డ్రగ్స్ ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. నో టూ డ్రగ్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి’ అని ఆయన సూచించారు.
Similar News
News November 23, 2025
28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ ఒకేసారి 25 బ్యాంకు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే CRDA బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. బ్యాంకుల ఏర్పాటుతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.
News November 23, 2025
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్‌లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్‌లను అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.


