News November 22, 2025
BREAKING: నిజామాబాద్ DCC అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాట్పల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. ఇక నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను నియమించారు.
Similar News
News February 19, 2026
NZB: 58 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ప్రతిరోజూ ఉ. 9 గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
News February 18, 2026
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News February 18, 2026
నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.


