News April 16, 2024
HYD: నాగోల్‌లో బాలికను బెదిరించి అత్యాచారం

బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగోల్‌లో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ PS పరిధికి చెందిన రాకేశ్ (29) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఓ బాలిక(13)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News September 11, 2025
HYD: బతుకమ్మకు రావాలని కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ పండుగ జరగనుంది. ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ కుమార్తె కవితకు చింతమడక వాసులు ఆహ్వానం పలికారు. ఎంగిలి పూల బతుకమ్మకు రావాలని సొంత ఊరి నాయకులు, ప్రజలు కోరారు. తప్పకుండా వస్తానని బతుకమ్మ వేడుకలు జరుపుకుందామని ఊరి ప్రజలకు హామీ ఇచ్చారు.
News September 11, 2025
HYDలో మా‘రూటే’ సపరేటు..!

ఎన్ని నియమాలు పెట్టినా నగరంలో రాంగ్ రూట్‌లో వెళ్లేవారి ధోరణి మారడంలేదు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే.. యూటర్న్, సిగ్నల్స్ వద్ద వచ్చేదే రాంగ్ రూట్‌లో ఆపై ఓవర్ స్పీడ్. కరెక్ట్ రూట్లో వెళ్లేవారినే కిందపడేస్తుంటారు. మళ్లీ వారితో వాదిస్తుంటారు. ఆటోవాలాలు, బైకర్లు, కార్లతో ఈ నిబంధనలు ఉల్లంఘింస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారపై ప్రభుత్వం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
News September 11, 2025
HYD: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోల్ ఫ్రీ నంబర్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం HYDలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను, హెల్ప్ డెస్క్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నం.1800 599 5991ను ఆవిష్కరించారు. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉ. 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందన్నారు.