News November 22, 2025

పెద్దపల్లి: మళ్లీ మక్కాన్ సింగ్‌కే అవకాశం..!

image

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోసారి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌కే అధిష్ఠానం అవకాశం కల్పించింది. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Similar News

News November 23, 2025

మూవీ అప్డేట్స్

image

✹ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో రానున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమంతో మొదలు.. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి
✹ ఇవాళ సాయంత్రం 6.11గంటలకు ‘రాజాసాబ్’ నుంచి రిలీజ్ కానున్న ‘రెబల్ సాబ్’ సాంగ్.. మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
✹ శివ నిర్వాణ, రవితేజ కాంబినేషన్లో రానున్న కొత్త మూవీ షూటింగ్ రేపటి నుంచి మొదలు!
✹ ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం తెలుగులో ‘అమరకావ్యం’గా విడుదల కానుంది

News November 23, 2025

వనపర్తిలో సత్యసాయి బాబా జయంతి వేడుకలు

image

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వరావు పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సత్యసాయి బాబా చిత్రపటానికి పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సత్యసాయి బాబా ట్రస్టు సాగునీటిని అందించిందని గుర్తు చేశారు. అంతరం డీఎస్పీ ఆయన సేవా కార్యక్రమాలను కొనియాడారు.

News November 23, 2025

HYD: సమయం లేదు మిత్రమా.. పనులు చకచకా

image

మరో రెండువారాల్లో (డిసెంబర్ 8,9) ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. దీంతో అధికారులు మీర్‌ఖాన్‌పేట వద్ద పనులు చకచకా చేయిస్తున్నారు. దాదాపు 120 ఎకరాలను చదును చేయిస్తున్నారు. పనులపై ఏరోజుకారోజు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అప్‌డేట్ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యం జరగరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో నిరంతరం పనులు చేయిస్తున్నారు.