News November 22, 2025
నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలి: సీతక్క

మేడారం జాతర పనులను యజ్ఞంలో చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు. మేడారం ఐటిడిఏ గెస్ట్ హౌస్‌లో సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతక్క మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తద్దన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు లేబర్, యంత్రాలు, నిపుణులను సమకూర్చుకొని నిర్ణీత సమయానికి పనులని పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 23, 2025
కమ్మగూడెం: 30ఏళ్లుగా మద్యం అమ్మకాలు నిషేదం

మర్రిగూడ మండలం కమ్మగూడెంలో 30ఏళ్లగా మద్యం అమ్మకాలు నిషేధించారు. ఇక్కడ నివసించే గ్రామస్థులు107 ఏళ్ల క్రితం గుంటూరు నుంచి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈ గ్రామంలో గొలుసు దుకాణాలు లేవని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గొలుసు దుకాణాల నిర్మూలనకు కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని ఊర్లలో గొలుసు లేకుండా చేయాలని వారు సూచించారు.
News November 23, 2025
మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.
News November 23, 2025
హనుమకొండ మోడల్ బస్టాండ్ నిర్మాణంపై మల్లగుల్లాలు!

HNKలో మోడల్ బస్టాండ్ నిర్మాణం మళ్లీ అనిశ్చితిలోకి వెళ్లింది. రూ.80 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల భవన సముదాయం, ఆర్ఎం కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాల్, వీఐపీ లాంజ్ వంటి ఏర్పాట్లతో కుడా అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే తాజా సమావేశాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు భవనాన్ని తామే నిర్మిస్తామని ప్రకటించడంతో కుడా నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంది. దీంతో ప్రాజెక్ట్ ముందడుగు తాత్కాలికంగా నిలిచాయి.


