News November 23, 2025
భూపాలపల్లి జిల్లాలో శనివారం ముచ్చట్లు

✓ భూపాలపల్లి DCC అధ్యక్షుడిగా భట్టు కర్ణాకర్
✓ భూపాలపల్లి: టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
✓ మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన తోటి కార్మికులు
✓ భూపాలపల్లి ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు ఒకటే బెడ్
✓ కాళేశ్వరం లో భక్తుల సందడి
✓ చిన్న కాళేశ్వరం పనులపై కలెక్టర్ సమీక్ష
✓ వే 2న్యూస్ కథనానికి స్పందించి గుంతలు పూడ్చిన అధికారులు
Similar News
News November 23, 2025
పత్తి రైతులకు తప్పని యాప్ కష్టాలు

పండించిన పంటను అమ్ముకోవడానికి ఇన్ని యాప్‌లలో నమోదుకు చేసుకోవాలా? అని కొందరు పత్తి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట వేశాక ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. లేకుంటే పంట కొనరు. పంట చేతికొచ్చాక అమ్మడానికి రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలి. తర్వాత CCIకి చెందిన కపాస్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఈ మూడూ అనుసంధానమైతేనే పత్తిని రైతులు అమ్ముకోగలరు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది.
News November 23, 2025
పెదవులు నల్లగా మారాయా?

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
News November 23, 2025
కొత్తగూడెం: పశువుల అక్రమ రవాణా గుట్టు రట్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టపగలే పశువుల అక్రమ తరలింపు బహిర్గతమైంది. మణుగూరు నుంచి కొత్తగూడెం ప్రాంతానికి టాటా ఏసీ వాహనంలో 10కి పైగా ఆవులను ఇరుకుగా ఎక్కించి రవాణా చేస్తుండగా, లోడు ఎక్కువై అంబేడ్కర్ సెంటర్ వద్ద వాహనం ఆగిపోయింది. దీంతో అక్రమ రవాణా గుట్టు రట్టయింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, వివరాలు సేకరిస్తున్నారు.


