News November 23, 2025
తిరుపతి: తెలుగు, సంస్కృతానికి పెద్దపీట వేసేనా..?

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ 2022లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తరువాత తిరుపతిలోనే రాష్ట్ర కార్యాలయం ఉన్నా పరిపాలన మాత్రం విజయవాడ నుంచి సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛైర్మన్‌గా విల్సన్ తొలిసారి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 24, 2025
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. విద్యాసంస్థలకు సెలవులు

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడంతో 18 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించారు. ఒకేసారి 2 సైక్లోనిక్ తుఫానులు రావడంతో తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెంకాసి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.
News November 24, 2025
కొహీర్: జీపీవో రాష్ట్ర కార్యదర్శిగా మల్లీశ్వరి

కొహీర్ మండల కేంద్రంలో జీపీవోగా పనిచేస్తున్న నీరుడి మల్లీశ్వరి రాష్ట్ర స్థాయి కీలక పదవికి ఎంపికయ్యారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జీపీవో రాష్ట్ర సదస్సులో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర జీపీవో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి మల్లీశ్వరి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
News November 24, 2025
ఏలూరు: గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి

జీలుగుమిల్లి (M)కామయ్యపాలెం సమీపంలో వాగులో స్నానానికి దిగి తెలంగాణలోని అశ్వారావుపేటకు చెందిన బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందగా.. మనుమడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో దొంతికుంట గ్రామంలో విషాదం అలుముకుంది.


