News November 23, 2025
GWL: హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యం: ఎస్పీ

హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యమని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు. పోలీస్ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించే హోంగార్డులకు అనారోగ్యం ఎదురైనప్పుడు ఆరోగ్య బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ బీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు.
Similar News
News November 23, 2025
వరంగల్: మూఢం ప్రారంభం.. శుభకార్యాలకు బ్రేక్!

ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యం ఫిబ్రవరి 17, 2026 వరకు కొనసాగనుంది. దాదాపు మూడు నెలలు శుభముహూర్తాలు లేకపోవడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ప్రతిష్ఠాపనలు నిలిచిపోనున్నాయి. రథ సప్తమి, వసంత పంచమి, మాఘపౌర్ణమి కూడా మౌఢ్యంలో పడటం వల్ల కార్యాలు జరగవు. దీంతో ఫంక్షన్ హాళ్లు, జ్యువెలరీ, బట్టల షాపులు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ రంగాల్లో భారీ నష్టం తప్పదని పురోహితులు చెబుతున్నారు.
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.oil-india.com/
News November 23, 2025
మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్ నివారణ, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.


